కడప జిల్లాలో కుంగిపోయిన మూడంతస్తుల భవనం

కడప జిల్లాలో ఓ మూడంతస్తుల భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది.స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని విద్యామందిర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బిల్డింగ్ మొదటి, రెండో అంతస్తుల్లో కుటుంబాలు నివాసం ఉంటుండగా.గ్రౌండ్ ఫ్లోర్ లో మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో అర్ధరాత్రి భవనం నుంచి భారీ శబ్దాలు రావడంతో రెండో అంతస్తులోని వారు బయటకు వచ్చి చూశారు.అప్పటికే భవనం ఓ వైపుగా కుంగిపోయింది.

అయితే తలుపులు తెరుచుకోకపోవడంతో మొదటి అంతస్తులోని వారు లోపలే చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు.

Advertisement

ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement