దిల్ రాజు బ్యానర్ లో పవర్ స్టార్

కొన్ని కాంబినేషన్స్ పేరు వినగానే ఎక్కడిలేని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ నుంచి నిర్మాతగా మారినప్పటి నుంచి అగ్ర కథనాయకులందరిని కవర్ చేసారు.

ప్రభాస్, అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు దాకా అందరితో సినిమాలు నిర్మించారు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మొదట పవన్ తీయాల్సిన సినిమా.

కారణాలు ఏవైనా తర్వాత పవన్ స్థానంలో మహేష్ వచ్చి చేరాడు.ఆ రకంగా మొదటిసారి పవన్ తో సినిమా నిర్మించే అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది.

చాలా కాలంగా అనుకునప్పటికి పవన్-దిల్ రాజు కాంబినేషన్ రక రకాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.మొత్తానికి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా పట్టలేక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఇదే విషయాన్ని నిన్న ప్రకటించారు దిల్ రాజు.అయితే కథ ఏంటి, దర్శకుడు ఎవరు, ఎప్పుడు మొదలవుతుంది తదితర విషయాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది.

నేను జిమ్ చేసేది బరువు తగ్గడం కోసం కాదు..నన్ను అలా చూడలేరు : ప్రగతి
Advertisement