ప్రభాస్‌ టైటిల్‌ను దిల్‌రాజు లాగేసుకున్నాడా... జానుగా సమంత మారబోతుందా?

ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సాహో చిత్రం తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న మూవీ పక్కా కమర్షియల్‌ లవ్‌ స్టోరీ.

ఆ చిత్రంకు హిందీ ప్రేక్షకులకు కూడా కనెక్ట్‌ అయ్యే విధంగా జానూ అనే టైటిల్‌ను పరిశీలించినట్లుగా సమాచారం అందుతోంది.త్వరలోనే యూవీ వారు ఆ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయడం ఖాయం అంటూ అంతా భావించారు.

అయితే ఆ టైటిల్‌ను ఇప్పుడు దిల్‌రాజు లాక్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

విభిన్న చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు ప్రస్తుతం తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 96 చిత్రాన్ని శర్వానంద్‌ మరియు సమంతలతో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి.ఈ రీమేక్‌కు 96 అనే నెంబర్‌ కాకుండా జాను అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగిందట.

Advertisement

జాను లేదంటే జాను అలియాస్‌ జానకి అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఎక్కువ శాతం జానుపైనే దిల్‌రాజుతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు.త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.ఆ సమయంలోనే సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేయాలని దిల్‌రాజు భావిస్తున్నాడు.మరో వైపు సమంత మజిలీ చిత్రాన్ని పూర్తి చేసుకుని ఈ రీమేక్‌లో నటించేందుకు సిద్దం అవుతోంది.96 చిత్రంలో విజయ్‌ సేతుపతి మరియు త్రిషలు నటించారు.ఈ చిత్రంలో వారి పాత్రలను శర్వానంద్‌ సమంతలు పోషించబోతున్నారు.

Advertisement