విజయ్‌ దేవరకొండ చెప్పిన విషయానికి దిల్‌ రాజు మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట

టాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ డేట్ల కోసం పెద్ద నిర్మాతలు క్యూ కడుతున్నారు.కాని విజయ్‌ మాత్రం ఆచితూచి సినిమాలకు ఓకే చెప్తున్నాడు.

ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని చేస్తున్న విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత కేఎస్‌ రామారావు నిర్మాణంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు.ఆ చిత్రానికి క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇక ఆ తర్వాత మైత్రి మూవీస్‌ వారికి డేట్లు ఇచ్చాడు.ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండను దిల్‌రాజు సంప్రదించాడని తెలుస్తోంది.

ఒక మంచి యూత్‌ఫుల్‌ కథ ఉంది సినిమా చేద్దామా అంటూ సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

బొమ్మరిల్లు వంటి కథతో సినిమాను చేద్దామంటూ విజయ్‌ దేవరకొండను సంప్రదించిన దిల్‌రాజుకు ఊహించని షాక్‌ ఎదురైందట.కేఎస్‌ రామారావు మరియు మైత్రి వారు పది కోట్లకు కాస్త అటు ఇటు పారితోషికం ఇస్తున్నారు.ఆ తర్వాత సినిమా కనుక 12 కోట్ల పారితోషికంకు ఓకే అంటే కథను వింటాను అంటూ దిల్‌రాజుతో విజయ్‌ దేవరకొండ అన్నాడట.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ చేస్తున్న సినిమాలు ఆడుతాయో లేవో తెలియదు.అటువంటి నేపథ్యంలో 12 కోట్ల పారితోషికం ఎలా ఇస్తామంటూ దిల్‌రాజు సన్నిహితులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

డియర్‌ కామ్రేడ్‌ కొత్త దర్శకుడు ఆ చిత్రం ఎలా ఉంటుందో ముందే చెప్పలేం, ఆ తర్వాత క్రాంతి మాధవ్‌ సినిమా, అది కూడా విజయ్‌ దేవరకొండకు సక్సెస్‌ తెచ్చి పెడుతుందనే నమ్మకం లేదు, మైత్రి వారి బ్యానర్‌లో ఎవరు దర్శకత్వం వహిస్తారో, ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ముందే ఊహించలేం.మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయితే విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ తగ్గే అవకాశం ఉంది.అలాంటప్పుడు 12 కోట్ల పారితోషికం ఇవ్వడం అనేది విజయ్‌ దేవరకొండకు చాలా ఎక్కువ అవుతుంది.అందుకే దిల్‌రాజు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.8 కోట్లకు ఓకే అంటే అడ్వాన్స్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Plinko: Pagos Y Acceso A La Cuenta — Guía Práctica Para Jugadores En Chile
Advertisement