'వారసుడు' రాకతో దిల్ రాజు ఇంట సంబరాలు..!

మన టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ఏదైనా ప్లాన్ చేసాడంటే ఇక తిరుగుండదు.

దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నాడు అంటే అది పక్కా హిట్ అనే ముద్ర పడిపోయింది.అంతలా ఈయన ఎంచుకునే సినిమాలు సక్సెస్ అవుతూ వచ్చాయి.

దిల్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈయన ఇంటిపేరుగా దిల్ సినిమాను పెట్టేసారు.దీంతో అప్పటి నుండి రాజు కాస్త దిల్ రాజుగా అవతరించాడు.

దిల్ రాజు గతంలో అన్ని మీడియం బడ్జెట్ తోనే సినిమాలు తీసి మంచి లాభాలు అందుకునే వాడు.అయితే బాహుబలి సిరీస్ తర్వాత మన తెలుగు సినిమా బడ్జెట్ లెక్కలు మారిపోవడంతో అందరు 100 కోట్లకు పైగానే బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తుండడంతో ఇక దిల్ రాజు కూడా రంగంలోకి దిగాడు.

Advertisement

ఈయన కూడా హై బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సిద్ధం అయ్యాడు.ఈ క్రమంలోనే వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు ప్రకటిస్తూ ఆకట్టు కుంటున్నాడు.

ప్రెసెంట్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ బ్యానర్ తెరకెక్కే 50వ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు.

శంకర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.అయితే కెరీర్ లో దిల్ రాజు సక్సెస్ ఫుల్ గా సాగుతుండగానే.

ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా శుభ వార్త అందడంతో మరింత సంతోషంగా ఉన్నాడు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

ఈయన కొన్నాళ్ల క్రితమే రెండవ పెళ్లి చేసుకున్న విషయం విదితమే.మరి ఇప్పుడు దిల్ రాజు ఇంట వారసుడు జన్మించాడని వార్త ఒకటి తెలిసింది.ఈయన సతీమణి పండంటి మగ బిడ్డకు ఈ రోజు జన్మనిచ్చినట్టు కన్ఫర్మ్ అవ్వడంతో దిల్ రాజు ఇంట సంబరాలు మొదలయ్యాయి.

Advertisement

వారసుడు రాకతో ఈయన కాంపౌండ్ లో సంతోషాలు వెల్లివిరిసాయి.ఈ వార్త తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

తాజా వార్తలు