పాలిటిక్స్ అన్నాక ఎవరి లెక్కలు వాళ్లవి! భర్త ఒక పార్టీలో ఉంటే.భార్య మరో పార్టీలో అధికారం వెలగబెట్టిన సంగతులు కూడా దేశానికి కొత్తకాదు.
నిజానికి రాజకీయాలంటేనే అలా ఉంటాయి! ఇప్పుడు ఇక్కడ ఏపీలోనూ జనసేనాని పవన్, ఆయన అగ్రజుడు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య పొలిటికల్‌గా అనేక సారూప్యతులున్నప్పటికీ.అదేసమయంలో అనేక తేడాలు కూడా కళ్లకు కడుతున్నాయి.
చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పేరుతో ఎకాఎకి బరిలోకి దిగిపోయాడు.అదృష్టం కలిసి వస్తే.
సీఎం సీటు దక్కించుకుందామనుకున్నా.అది దక్కలేదు.
దీంతో తన ఎమ్మెల్యేలతో కలిసి.చిరు ఒక రోజు కాంగ్రెస్‌లో చేరిపోయారు.
అయితే, ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించిన యువరాజ్యం నేత పవన్ కళ్యాణ్.అప్పటి రాజకీయ స్ఫూర్తిని తీసుకుని జనసేన పేరుతో తిరిగి అరంగేట్రం చేశారు.
అయితే, ఈయన ఎలాంటి కేడర్‌ను ఏర్పాటు చేసుకోలేదు.అంతేకాదు, ప్రధాన పార్టీ సలహాదారులు ఓ కమిటీ అంటూ ఏమీ లేకుండానే జనసేన నడుస్తోంది.
అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే.పుట్టి మూడు వారాలు కూడా కాకుండానే రాజకీయ మేధావులైన చంద్రబాబు, నరేంద్ర మోదీ వంటి వారికి 2014 ఎన్నికల్లో మద్దతిచ్చి.
తన సత్తా ఏంటో చూపించాడు పవన్.అంతేకాదు, పవన్ లేకపోతే.
మా పరిస్థితి ఏంటి? అనే రేంజ్‌కి ఆ పార్టీలను తీసుకెళ్లగలిగాడు పవన్.ఇప్పుడు ఈ విషయంలోనే అటు చిరంజీవి, ఇటు పవన్‌లపై చర్చ నడుస్తోంది.
అన్న చిరు.పార్టీని స్థాపించి ఓ రేంజ్‌లో ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో వీలీనం చేసేయడం, మరి పవన్ కేవలం పార్టీ పేరును మాత్రమే పెట్టి.
ఏమీ ఏర్పాటు చేసుకోకపోవడం గమనార్హం.అయినప్పటికీ.
కేంద్రానికి ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ మద్దతు ఇవ్వడం జరుగుతోంది.ఈ విషయంలోనే అన్నదమ్ముల పొలిటికల్ మైండ్ సెట్స్‌పై సర్వత్రా చర్చ నడుస్తోంది.
చిరు, పవన్ రాజకీయ తేడాలపై ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతుండడం గమనార్హం.ఇక పవన్ వరుసగా సినిమాలు చేసేని వచ్చే ఎన్నికల నాటికి సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైం పొలిటిషీయన్‌గా ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు.
ఇక పొలిటికల్‌గా ప్లాప్ షో వేసిన చిరు ఇప్పుడు కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.ఇకపై వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరు ఫ్యూచర్‌లో ఎలా రూటు మారుస్తారో చూడాలి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy