మీకు తెలుసా: మొసలి నోట్లోకి వెళ్లి ప్రాణంతో తిరిగి వచ్చే ఏకైక ప్రాణి ఏదంటే..?!

మనుషులకు ఏవైనా దంత సమస్యలు( Dental problems ) వస్తే వెంటనే డెంటిస్ట్ లను ఆశ్రయిస్తారు.డెంటల్ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందుతారు.

డెంటిస్ట్ లు మన దంతాలను పరీక్షించి దానికి అవసరమైన ట్రీట్‌మెంట్ చేస్తారు.అదే జంతువులకు దంత సమస్యలు వస్తే ఎవరు చికిత్స అందిస్తారనే అనుమానం ఉంటుంది.

మిగతా జంతువులకు ఏమో కాని మొసలికి మాత్రం ప్రకృతి ప్రదర్శించిన ఓ దంత వైద్యుడు ఉన్నారు.అదే ఓ పక్షి.

ఓ పక్షి మొసలికి దంత వైద్యుడిగా మారింది.

Advertisement

ప్లోవర్( Plover ) అనే పక్షి మొసలికి దంత వైద్యుడిగా పనిచేస్తుంది.మొసలి పళ్లను క్లీన్ చేయడంతో పాటు లోపల చిక్కుకున్న మురికిని తొలగిస్తుంది.పళ్ల లోపల ఇరుక్కుపోయిన మాంసాహారాన్ని, ఇతర వ్యర్థాలను తొలగిస్తుంది.

ఈ పక్షి మొసలి దంతాల్లో ఇరుక్కుపోయిన వ్యర్థాలను తింటూ ఉంటుంది.దీని వల్ల మొసలి దంతాలు శుభ్రవువతాయి.

మొసలి నోట్లోకి వెళ్లినా ఈ పక్షికి ఎలాంటి ప్రమాదం ఉండదు.నోట్లోకి వెళ్లినా తిరిగి బయటకు వస్తూ ఉంటుంది.

సాధారణంగా ఏదైనా జీవివి మొసలి చిక్కిందంతే ఇక అతే సంగతులు.నమిలి నమిలి తినేస్తుంది.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

కానీ ప్లోవర్ పక్షి మాత్రం మొసలి లోపలికి వెళ్లి హాయిగా తిరిగి వస్తుంది.

Advertisement

ప్లోవర్ పక్షిని మొసలి( crocodile ) ఏమీ చేయదట.దానికి కారణం దంతాలను క్లీన్ చేయడమేనని చెబుతున్నారు.ఈ పక్షి తన దంతాలను క్లీన్ చేస్తుందని మొసలికి అర్ధమవుతుందట.

అందుకే ప్లోవర్ పక్షిని మొసలి తినేయదు.దీంతో ఈ రెండు జీవుల మధ్య స్నేహబంధం అలా కొనసాగుతూ ఉంది.

ప్లోవర్ పక్షి మొసలి దంతాల్లో చిక్కుకున్న వ్యర్థాలను తినడం వల్ల దాని ఆకలి కూడా తీరుతుంది.ఇలా ఆ పక్షికి మొసలి ఉపయోగపడుతుంది.

మొసలి నోట్లోకి వెళ్లి ప్రాణంతో తిరిగొచ్చే పక్షి ఇదొక్కటే అని చెప్పవచ్చు.

తాజా వార్తలు