Naveen Polishetty: పవన్ కళ్యాణ్ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటించిన మీకు తెలుసా.. కానీ..!!

జాతి రత్నాలు ( Jathi Rathnaalu ) సినిమాతో ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎదిగారు నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ).

ఈయన అంతకుముందే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగిటివ్ పాత్రలో అలాగే మహేష్ బాబు 1 నేనొక్కడినే,తాప్సి మెయిన్ లీడ్ చేసిన మిషన్ ఇంపాజిబుల్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాల్లో చేశారు.

అలాగే ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం జాతి రత్నాలు సినిమా.ఇక ఈ మధ్యకాలంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mr.Polishetty ) అనే సినిమాతో నవీన్ పోలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్కతో జత కట్టారు.ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా మంచి వసూలు చేసింది.

ప్రస్తుతం కామెడీ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రియదర్శి,నవీన్ పోలిశెట్టి వంటి వాళ్ళు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదిస్తున్నారు.అయితే నవీన్ పోలిశెట్టి పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) తో కూడా ఓ సినిమాలో నటించారట.

కానీ ఇప్పటివరకు ఆ విషయం ఎవరికీ తెలియదు.ఎందుకంటే ఆయన నటించిన సన్నివేశాలు లేవు కాబట్టి.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా నటించారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ( Katamarayudu ) ఎన్నో అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో పాటలు ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం ప్లాఫ్ అయింది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తమ్ముళ్లుగా కమల్ కామరాజు, అజయ్,చైతన్య, శివ బాలాజీ, ఆలీ లాంటివాళ్ళు నటించారు.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తమ్ముడిగా ముందుగా నవీన్ పొలిశెట్టి నటించారట.

ఈయనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించాక నవీన్ పోలిశెట్టి కి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయట.దాంతో అనారోగ్య సమస్యల వల్ల ఆ షూటింగ్ పూర్తి చేయలేకపోయారట.ఇక షూటింగ్ ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో నవీన్ పోలిశెట్టి ని ఆ సినిమా నుండి తీసేసి ఆయన ప్లేస్ లో శివబాలాజీ ( Shiva Balaji ) ని తీసుకున్నారట.

అలా నవీన్ పోలిశెట్టి పవన్ కళ్యాణ్ సినిమా నటించిప్పటికి ఆరోగ్య కారణాల వల్ల స్క్రీన్ మీద కనిపించలేకపోయారట.ఇక ఈ విషయం చాలామందికి తెలియదు.

ఆ సౌత్ డైరెక్టర్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ఉపాసన సింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు