ఇసుకలో ఈదే జీవి గురించి మీకు తెలుసా..!?

ఇసుకలో ఈదే జీవి గురించి మీకు తెలుసా.!? పిల్లలూ.నీటిలో ఇదే జీవులు గురించి తెలుసు కానీ ఇసుకలో ఈదగాలిగే జీవి గురించి తెలియదు కదా.

? మరి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందామా వీపుపై డొప్ప, ముందరి పాదాలకి బలమైన గోళ్ళు చిన్న మొహంతో చూడగానే వింతగా ఉంటుంది.ఇది చక్కగా అరచేతిలో కుదురుగా కూర్చుంటుంది కూడా.దీనిపై నిర్మాణం మొత్తం 5 అంగుళాలు.120 గ్రాముల బరువు ఉంటుంది.ఈ జీవికి ఓ ప్రత్యేకతగా ఉంది.

ఇసుక లో చాలా ఫాస్ట్ గా ఈదుతుంది.పాదాలతో ఇసుకను దోచుకుంటూ చాలా వేగంగా ముందుకు వెళుతుంది.

అందుకే దీన్ని ఇసుకలో ఈదే జీవి అని పిలుస్తారంతా.ఇవి నేలలో గొయ్యి తవ్వుకునో అందులో నివసిస్తాయి.

ఏదైనా ఆపద వచ్చినట్టు అనిపించింది అంటే చాలు కొన్ని సెకన్లలోనే వేగంగా గొయ్యి తవ్వేసుకుని దాక్కునిపోగలదు.దీన్ని చూసిన ఏదైనా జంతువు పరుగెత్తుకొని వచ్చేలోపు ఇది నెలలో కి వెళ్ళిపోతుంది.

Advertisement

దీని పాదాలకు ఉన్న గోళ్ళు చాలా పదునుగా ఉంటాయి.ఇవి రాత్రులు ఆహారం కోసం బయటకు వస్తాయి.

చీమలు వాటి లార్వాలను ఎంతో ఇష్టంగా తింటాయి.చిన్న పురుగులు, నత్తలు, వానపాములు, మొక్కల వేళ్లను తిని బతుకుతాయి.

దీని తోక కదలకుండా బిగుసుకుని ఉంటుంది.కనీసం పదేళ్ల అయినా బతికే ఈ జీవులను కుక్కలు వెంటబడి మరీ తింటాయి.

దీని వీపు మీద ఉండే డొప్ప లేత గులాబీ రంగులో ఉండటం వల్ల దీనికి పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో  పేరు వచ్చింది.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు