వారు ముందే ఓటమిని ఒప్పేసుకుంటున్నారా ? ప్రచారానికి ఎందుకు వెనకడుగు ?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు సంకేతాలు వస్తుండడంతో ఆ పార్టీలో కొంచెం జోరు తగ్గినట్టు కనిపిస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉన్నట్టు అర్ధం చేసుకున్న కొంతమంది నాయకులు ముందుగానే తట్టా బుట్టా సర్దేసుకునే పనిలో పడ్డట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దీనికి తోడు జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ ఏపీలో అధికార పార్టీకి ప్రతికూల పవానాలు వీస్తున్నాయి అని తేల్చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.దీంతో వారిలో ఒకరకమైన అభద్రతా భావం ఏర్పడి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.

ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై సీరియస్ గా దృష్టిసారించిన టీడీపీ అధిష్టానానికి అభ్యర్థుల మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి.అదీ కాకుండా రాష్ట్రంలోని ప్రచార శైలిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన టీడీపీ తమ పార్టీ నుంచే షాక్ తగిలే సమాచారం వస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 చోట్ల అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్ధులు, దాదాపు 8 చోట్ల లోక్ సభ అభ్యర్ధులు ఎన్నికల ప్రచారాన్ని చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారట.తాము ఎలాగో గెలిచే పరిస్థితి లేదని, ఇప్పుడు ఎంత శ్రమపడ్డా లాభం ఏముంటుంది అనే ఆలోచనతో రోజు మొత్తం మీద రెండు మూడు గంటలకు మించి తిరగడం లేదట.

Advertisement

ఈ విధంగానే అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ఎండ వంకతో కేవలం రాత్రిపూట మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నట్టు అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి.దీనిపై స్థానికంగా అక్కడి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట.విశాఖ పట్టణంలో మరో నాయకుడైతే అసలు కారులోంచి దిగకుండానే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని , కారులో వెళ్లలేని ప్రాంతాలను అసలు పట్టించుకోవడం లేదని టిడిపి కార్యాలయానికి అందిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉభయగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధులు సీరియస్ గా పని చేయడం లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి.నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అభ్యర్ధులు మరింత సీరియస్ గా పనిచేయకపోతే పరిస్థితి పూర్తిగా చేజారిపోతుందని టీడీపీ అధిష్టానం ఆయా జిల్లా నాయకులకు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు