రాజకుమారుడు సినిమాను అంత మంది దర్శకులు రిజెక్ట్ చేశారా..? మరి రాఘవేంద్ర రావు ఎలా చేశాడు...

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా( Mahesh Babu ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈరోజు తో 25 సంవత్సరాలు పూర్తవుతుంది.

అయితే ఆయన 1999వ సంవత్సరంలో రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఈ సినిమాతో అలరించడమే కాకుండా మహేష్ బాబు కు ప్రిన్స్ అనే ఒక బిరుదును కూడా కట్టబెట్టిందనే చెప్పాలి.ఇక మొదట్లో ఈ సినిమా మీద చాలా రూమర్లు వచ్చినప్పటికీ మహేష్ బాబు మాత్రం ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.

ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా ఆయన కెరియర్ లోనే ఒక మంచి సినిమాగా మిగిలిపోయింది.

ఇక రాఘవేంద్ర రావు( Kovelamudi Raghavendra Rao ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డెబ్యూ ఫిలిం గా ఆయనకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టడమే కాకుండా మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదగడానికి కూడా ఒక మంచి పునాదిని వేసిందనే చెప్పాలి.అయితే 25 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజకుమారుడు సినిమా( Raja Kumarudu )కి బ్యాకేండ్ లో మరొక స్టోరీ ఉందనే చెప్పాలి.అయితే మొదట కృష్ణ ఈ సినిమాని వేరే దర్శకుడితో చేద్దామని అనుకున్నాడట.

Advertisement

ఇక పరుచూరి బ్రదర్స్ అందించిన ఈ కథతో కొంతమంది దర్శకుల వద్దకు వెళ్లి వాళ్లను అప్రోచ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది.

వాళ్ళు ఈ సినిమా చేయడానికి అంత సుముఖంగా లేకపోవడంతో స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావుతో ఈ సినిమాని చేయించాడు.ఇక మొత్తానికైతే కొత్తవాళ్ళను పరిచయం చేయడం లో రాఘవేంద్ర రావు గారిది లక్కీ హ్యాండ్ అని ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది చెబుతూ ఉంటారు.ఇక అది మహేష్ బాబు విషయంలో మరొకసారి ప్రూవ్ అయిందనే చెప్పాలి.

ఇక చాలా మంది డైరెక్టర్లు రిజెక్ట్ చేసిన గాని రాఘవేంద్రరావు మాత్రం చాలా బిజీగా ఉన్నప్పటికీ కృష్ణ మీద ఉన్న అభిమానం తో ఈ సినిమాని చేసి మహేష్ బాబు కి ఒక సూపర్ సక్సెస్ ని అందించాడు.

మంచు విష్ణు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన మీనా.. ఆ వార్తలు ఎంతో హర్ట్ చేశాయా?
Advertisement

తాజా వార్తలు