అలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్న రాబిన్ హుడ్ సినిమా.. ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదుగా!

టాలీవుడ్ హీరో నితిన్ (Hero Nithin)హీరోగా నటించిన తాజా చిత్రం రాబిన్ హుడ్(robin hood).

మొదట ఈ సినిమాను డిసెంబర్ 24 విడుదల చేయాలి అని మూవీ మేకర్ ఫిక్స్ అయ్యారు.

కానీ విడుదల తేదీని 25 కు మారుస్తూ అధికారికంగా ప్రకటన కూడా చేశారు.అయితే ఇప్పుడు 25వ తేదీ కాకుండా మళ్ళీ విడుదల దీనిని వాయిదా వేశారు.

దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలే అవుతుంది అన్న విషయంపై క్లారిటీ లేదు.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 సినిమా వివాదాలే ఎక్కువగా కనిపిస్తుండడంతో పాటు అల్లు అర్జున్ వల్ల మైత్రి మేకర్స్ ఇప్పుడు ఏ సినిమా ప్రమోషన్ మీద దృష్టి పెట్టే పరిస్థితిలో లేరు.

ఒకరకంగా చెప్పాలంటే రాబిన్ హుడ్ తప్పుకోవడం మంచిదే అయ్యింది.

Advertisement

కానీ నితిన్ మాత్రం ఈ డెసిషన్ పట్ల ముందు నుంచి సానుకూలంగా లేడనేది ఫిలిం నగర్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.ఏది ఏమైనా రాబిన్ హుడ్ సినిమా మంచి అవకాశాన్ని మిస్ అయ్యాడని చెప్పాలి.ఎందుకంటే ఇటీవల వచ్చిన నాలుగు సినిమాలలో ఏ సినిమాకు కూడా పెద్దగా హిట్ టాక్ రాలేదు.

అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో కూడా భారీగా విఫలమయ్యింది.ఇక ఉపేంద్ర యుఐకి మంచి హడావిడితో పాటు కలెక్షన్లు వస్తున్నాయి.ఒకవేళ వీక్ డేస్ కూడా స్ట్రాంగ్ గా నిలబడితే గొప్పని ఒప్పుకోవచ్చు.

మహేష్ బాబు డబ్బింగ్ పుణ్యమాని ముఫాసాకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన దానికన్నా భారీ వసూళ్లు వచ్చాయి.

అయితే వీటిలో ఏదైనా సినిమాకు వెళ్లాలంటే మూడో వారంలో కూడా జనం పుష్ప 2నే ఛాయస్ గా పెట్టుకుని హౌస్ ఫుల్స్ చేశారంటేనే నితిన్ ఏం మిస్ చేసుకున్నాడో అర్థమవుతోంది.ఒకవేళ రాబిన్ హుడ్ కనక ఇప్పుడు వచ్చి పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకొని ఉంటే మంచి నెంబర్లు కనిపించేవి.అయితే షూటింగ్ కాకపోవడం వల్లనో పోస్ట్ ప్రొడక్షన్ లాంటి ఇతర కారణాల వల్లనో ఏదైతేనేం తప్పుకోవడం వల్ల నష్టమైతే జరిగింది.

మరోమారు సాధువును దర్శించుకున్న కోహ్లీ దంపతులు.. (వీడియో)
సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి స్పూర్తి ఆ హీరోనా.. ఈ షాకింగ్ విషయం తెలుసా?

సంక్రాంతికి వచ్చినా రిపబ్లిక్ డేకి వెళ్లినా లేదా ప్రచారం జరుగుతున్నట్టు ఏప్రిల్ 10 ఎంచుకున్నా రాబిన్ హుడ్ కి చాలా పెద్ద పోటీ స్వాగతం చెప్పబోతోంది.

Advertisement

తాజా వార్తలు