రేవంత్ వేసిన ఆ వ్యూహంతో అసమ్మతులకు చెక్ పెట్టినట్టేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులతో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా రేవంత్ పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.అయితే సీనియర్ నేతలు రేవంత్ నాయకత్వంపై, రేవంత్ నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండటంతో అంతేకాక ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో రేవంత్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అధిష్టానం జగ్గారెడ్డి లాంటి నేతలపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

దీంతో ఆ సమయంలో జగ్గారెడ్డితో కనీసం మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకురాకపోవడంతో ఒక్కసారిగా అధిష్టానం ఎంతగా సీనియర్ లకు వార్నింగ్  ఇచ్చిందనే చర్చ మొదలైన పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు ఇప్పటి నుండి ఎన్నికల వరకు ప్రతి ఒక్క రోజు చాలా ముఖ్యమైన రోజు మాత్రమే కాక చాలా బలంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

లేకుంటే కాంగ్రెస్ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం లేని పరిస్థితులు నెలకొంటాయి.

Did Revanth Reddy Put A Check On The Disagreements With That Strategy Details, T
Advertisement
Did Revanth Reddy Put A Check On The Disagreements With That Strategy Details, T

అయితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా తెలంగాణలో ఎదిగేందుకు పెద్ద ఎత్తున అవకాశం ఉన్న పరిస్థితులు ఉన్నాయి, రాబోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.ఎందుకంటే కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ చేరుతారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఇంకాస్త కొంత వ్యూహాత్మకంగా వెళ్ళి ప్రజలను ఆకట్టుకోగలిగితే మొదటి స్థానంలో కన్నా రెండో స్థానానికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం వందకు వంద శాతం ఉంది.మరి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు