వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర విజయవంతంగా సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పలు జిల్లాలలో బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.
ఏడో రోజు శ్రీ సత్య సాయి జిల్లాలో ధర్మవరంలో( Dharmavaram ) నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( MLA Kethireddy Venkatrami Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.సమాజంలో 80% ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే( CM Jagan ) అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకే ఇచ్చారు.సంక్షేమ పథకాలను( Welfare Schemes ) డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే.గత నాలుగున్నర ఏళ్లలో ధర్మవరం నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయల లబ్ధి పొందారని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలని సూచించారు.రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు( Chandrababu Naidu ) చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy