అక్కడ అమ్మవారు ఉదయం బాలికగా.. మధ్యాహ్నం మహిళగా.. రాత్రి వృద్ధురాలిగా.. కనిపిస్తారట..! ఎక్కడో తెలుసా?

శక్తివంతమైన ఆలయాలకు, చరిత్రకు నెలవు మన దేశం.ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి.

అయితే ప్రతి ఒక్క గుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.అయితే ఒక ఆలయంలో ఒకే రోజులో అమ్మవారు బాలికగా, యువతిగా, వృద్ధురాలిగా కనిపిస్తుంది.

అయితే ఈ విశిష్ట దేవాలయంలో అన్ని అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి.ఉత్తరాఖండ్ లోని( Uttarakhand ) శ్రీనగర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే అద్భుతాన్ని చూసి అక్కడ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు.ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత ధారీదేవి.

Advertisement

( Dharidevi ) బద్రీనాథ్ కు, శ్రీనగర్ కు వెళ్లే దారిలో కల్యాసౌర్ గ్రామంలో అలకనంద నది ఒడ్డున ఈ దేవాలయం ఉంటుంది.

ఆదిశక్తి విగ్రహం మహాకాళి అవతారమే ధారీదేవి.అయితే భక్తితో కొలిచిన వారిని అనుగ్రహించే దేవత అయినా ధారీదేవినీ ధిక్కరిస్తే మాత్రం అంతుచిక్కని కీడు జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు.2013లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలగించడమే ప్రధాన కారణం అని చెబుతారు.శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి సమీపంలో కొండపై ప్రతిష్టించింది.

ఆ మరుసటి రోజు నుండే కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్రరూపం దాల్చి విలయతాండవం చేసింది.దీంతో అలకనంద ఉగ్రరూపంలో దాదాపు పదివేల మంది మృత్యువాత పడ్డారు.

ఆ తర్వాత మళ్లీ విగ్రహాన్ని అదే స్థానంలో ప్రతిష్టించడం జరిగింది.ఇక గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ ధారాదేవి ఆలయం( Dhari Devi Temple ) గర్భగుడిలో అమ్మవారు సగభాగం మాత్రమే ఉంటుంది.ఇక మిగతా భాగం కాళీమఠ్‌లో ఉందని చెబుతారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్ వీడియో : చావు అంచులదాక వెళ్లి రావడం అంటే ఇదేనేమో

అయితే నిజానికి కాళీమఠ్‌లో అమ్మవారి మిగతా శరీరం ఉండదు.ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు.

Advertisement

ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా ఉంటుంది.ఇక ఆలయంలో అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడివయసు మహిళగా, సాయంత్రం వృద్ధురాలిగా మారుతూ ఉంటుంది.

దీన్నిబట్టి అమ్మవారి శక్తి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

తాజా వార్తలు