Tirumala Vaikuntha Ekadashi : వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులు ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలా..

తిరుమల తిరుపతి దేవస్థానానికి మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.

అయితే ఈ దేవస్థానానికి వెళ్లాలంటే ముందస్తు టికెట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి.

వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి ఏర్పాట్లు చేస్తూ వస్తోంది.ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఈ పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది.

అంతేకాకుండా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తోంది.వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో వివిధ శాఖల అధికారులతో కొన్ని రోజుల క్రితమే సమావేశం నిర్వహించి చర్చించారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు.పోయిన రెండు సంవత్సరాలుగా జరుగుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ద్వార దర్శనం 11 రోజులపాటు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించే అవకాశం ఉంది.2023 జనవరి 2వ తేదీన నుంచి వైకుంఠ ఏకాదశి పుష్కరించుకొని తిరుమల శ్రీవారి ద్వార దర్శనాలు మొదలుపెడతారు.ప్రతిరోజు 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు.

Devotees Who Go For Darshan Of Vaikuntha Should Keep These Things In Mind ,devot
Advertisement
Devotees Who Go For Darshan Of Vaikuntha Should Keep These Things In Mind ,Devot

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ప్రతి రోజూ 25 వేల టికెట్లు మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది.10 రోజులకు కలిపి రెండున్నర లక్షల టికెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.2023 జనవరి నెలలో ఈ టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేసే అవకాశం ఉంది.అదేవిధంగా తిరుమల స్థానిక భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతిలో తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వల్ల ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్పారు.ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు