ఆ ఏనుగు కోసం భక్తులు చెప్పులు చేయించారట.. ఎందుకో తెలుసా?

మన హిందూ సంప్రదయాలా ప్రకారం మనకు మూడో కోట్ల మంది దేవతలు ఉన్నారు.అయితే వారందరిలో చాలా దేవుళ్లకు మనం పూజలు చేస్తుంటాం.

అంతేనా ఆ దేవుళ్లకు కోరుకున్న కోరికలు తీరితే.విలువైన కానుకలను సమర్పిస్తుంటాం.

బంగారం, వెండి, పట్టుబట్టలు ఇలా ఒక్కటేమిటి.సవాలక్ష రకాలుగా కానుకలు ఇస్తూ మొక్కులు చెల్లించుకుంటాం.

అయితే తమిళనాడులోని తిరునల్వేలిలోని నేలాయప్పర్ గాంధీమతి అమ్మన్ ఆలయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.దేవస్థానం ఏనుగుకు 12 వేల విలువ చేసే చెప్పులను కానుకగా ఇచ్చారు.

Advertisement
Devotees Donated Sandals At The Nellai Temple Elephant Details, Elephant Sandals

అంటే గుడిలో ఉండే దేవుడికే కాదండోయ్.అక్కడ ఉండి స్వామి వారికి సేవలు చేసే ఏనుగుకు కూడా కానుకలు సమర్పించారు.

అయితే ఈ ఏనుగు పేరు గాంధీ మతి. అయితే గత 39 ఏళ్లుగా నేలాయప్పర్ దేవాలయంలోనే సేవలు అందిస్తోంది ఈ గజరాజు.ప్రస్తుతం ఈ ఏనుగు వయసు 52 సంవత్సరాలు.

అయితే 2017లో గాంధీమతి అనారోగ్యం పాలైంది.పరీక్షలు చేయించగా.అధిక బరువుతో బాధ పడుతోందని వైద్యులు చెప్పారు.300 కిలోలు బరువు అదనంగా ఉందని తెలిపారు.

Devotees Donated Sandals At The Nellai Temple Elephant Details, Elephant Sandals

గజరాజు బరువు తగ్గితే ఆరోగ్యంగా ఉంటుందన్నారు.దీంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు ఏనుగును 5 కిలో మీటర్లు నడిపిస్తున్నారు.ఇలా చేయడం వల్ల ఆరు నెలల్లోనే 150 కిలోల బరువు తగ్గింది.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

అయితే అప్పటి నుంచి కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతోంది.ఈ విషయం తెలిసిన భక్తులు ఏనుగు కోసం ప్రత్యేకంగా పాద రక్షలు చేయించి అంద జేశారు.

Advertisement

తాజా వార్తలు