ముమ్మరంగా డెక్కన్ మాల్ కూల్చివేత పనులు

హైదరాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ కూల్చివేత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం కాగా బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది.

ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మాల్ కూల్చివేత పనులను మాలిక్ ట్రేడర్స్ గత రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభించారు.

అయితే ఈ కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి హమీ ఇచ్చారు.మరోవైపు నిన్న రాత్రి కూడా డెక్కన్ మాల్ లో మంటలు చెలరేగాయి.

దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు