మోనాలిసా భారతీయ మహిళ అయితే ఎలా ఉంటుందో చూశారా.. ఇమేజ్ ఇదిగో!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కళా రంగంలో కొత్త విప్లవం సృష్టిస్తోంది.

ఆర్టిస్టులు ఇప్పుడు AI సాధనాల సాయంతో తమ ఊహలకు పదును పెట్టి, మునుపెన్నడూ చూడని అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నారు.

ఈ క్రమంలో, ఢిల్లీ యూనివర్సిటీకి( Delhi University ) చెందిన ఒక విద్యార్థిని లియోనార్డో డా విన్సీ గీసిన మోనా లిసాకు( Mona Lisa ) ఇండియన్ టచ్ అందించి ఆశ్చర్యం కలిగించారు.ఈ కొత్త చిత్రంలో, మోనా లిసా సంప్రదాయ భారతీయ దుస్తులు( Indian Costume ) ధరించి, తలపై దుపట్టా అందంగా చుట్టుకుని ఉన్నట్లుగా కనిపించింది.

ఆమెను మంగళ సూత్రం, చెవి దిద్దులు, అందమైన నెక్లెస్ వంటి భారతీయ ఆభరణాలతో ఆర్టిస్టు అందంగా అలంకరించారు.ఈ డీటెయిల్స్‌తో ఆమెకు ఒక ప్రత్యేకమైన భారతీయ అందాన్ని అందించారు.

మోనాలిసా ఇండియన్ లుక్ లో కనిపించడం చాలామందికి నచ్చేసింది.

Delhi University Student Creates Indian Version Of Mona Lisa Using Ai Pic Viral
Advertisement
Delhi University Student Creates Indian Version Of Mona Lisa Using AI Pic Viral

ఈ చిత్రాన్ని రూపొందించిన ఆర్టిస్ట్ పేరు రాశి పాండే.( Rashi Pandey ) ఆమె తాను కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన భారతీయ మోనా లిసా( Indian Mona Lisa ) చిత్రాన్ని X (ట్విట్టర్) వేదికగా పంచుకుని, ఆ చిత్రానికి పేరు సూచించాలని కోరారు.ఆమె చిత్రంతో పాటు "నేను మోనా లిసా భారతీయ వెర్షన్‌ను AI సాయంతో తయారు చేశాను.

" అని రాశారు.

Delhi University Student Creates Indian Version Of Mona Lisa Using Ai Pic Viral

ఆమె పోస్ట్ వైరల్‌గా మారగా, నెటిజన్లు ఆమెకు క్రియేటివ్, ఫన్నీ నేమ్స్ సూచించారు.కొందరు ఆమెను "షోనా లిసా", "మోనా తాయి", "లిసా బెన్" అని పిలిచారు.మరికొందరు ఆమెను భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళగా ఊహించారు.

ఒక నెటిజన్ ఆమెకు బిందీ వేసి "మోనా లిసా బేగం" లేదా "మోనా లిసా మేరీ" అని పేరు పెట్టాలని సూచించారు.మరొకరు ఆమె "త్రీ ఇడియట్స్" సినిమాలోని పాత్రలా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!

చాలామంది ఆ కళాఖండాన్ని ప్రశంసించారు.ఒకరు "ఈ వెర్షన్ అసలు చిత్రం కంటే మరింత అందంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.

Advertisement

భారతీయ మహిళగా కనిపిస్తున్న మోనా లీసా ఇమేజ్‌ను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు