ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు కస్టడీ పొడిగింపు అయింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం.

ఈ మేరకు జ్యుడీషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిని ఇచ్చింది.దీంతో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను తీహార్ జైలుకి తరలించారు.

జైలులో శరత్ చంద్రారెడ్డికి ఇంటి భోజనం అందించేందుకు కూడా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.ఇద్దరు నిందితులకు జైలులో అవసరమైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను రౌస్ అనెన్యూ కోర్టు డిసెంబర్ 5కి వాయిదా వేసింది.అదేవిధంగా వీరి బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 24కి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు