'డియర్‌ కామ్రేడ్‌' మొదటి వారంలో ఎంత రాబట్టిందో తెలుసా?

విజయ్‌ దేవరకొండ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.కథ మెయిన్‌ లైన్‌ బాగానే ఉన్నా.

దాని చుట్టు అల్లిన కథనం ఏమాత్రం బాగా లేదు.సినిమా ప్రమోషన్‌ సమయంలో అంచనాలు పీక్స్‌కు తీసుకు వెళ్లారు.

కాని ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు అస్సలు సినిమాను పట్టించుకోవడం లేదు.మొదటి రోజు కాస్త పర్వాలేదు అన్నట్లుగా కలెక్షన్స్‌ వచ్చాయి.

ఆ తర్వాత రెండు రోజులు వీకెండ్స్‌ అవ్వడం వల్ల ఒక మోస్తరుగా వసూళ్లు నమోదు అయ్యాయి.

Dearcomrade First Weekcollections
Advertisement
Dearcomrade First Weekcollections-డియర్‌ కామ్రేడ్�

సోమవారం నుండి విజయ్‌ దేవరకొండ మొహం కూడా చూడకుండా డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని ప్రేక్షకులు అవైడ్‌ చేశారు.మరీ దారుణమైన ఫలితాన్ని కట్టబెట్టారు.ఏమాత్రం ఆకట్టుకోని కథనం అంటూ సెకండ్‌ హాఫ్‌పై విమర్శలు వ్యక్తం అయ్యాయి.

విజయ్‌ దేవరకొండ తన క్రేజ్‌తో సినిమాకు మినిమం కలెక్షన్స్‌ అయితే రాబట్టగలిగాడు.శుక్ర, శని, ఆది వారాల్లో సినిమా ఒక మోస్తరుగా రాబట్టడంతో నిర్మాతలు మరియు బయ్యర్లు కొద్దిలో కొద్దిగా అయినా బయట పడ్డట్లయ్యింది.

మొదటి వారం మొన్నటితో పూర్తి అయ్యింది.మొదటి వారంలో ఈ చిత్రం 20.49 కోట్ల రూపాయలను రాబట్టింది.

Dearcomrade First Weekcollections

మొదటి వారం షేర్‌ : నైజాం : 6.54 కోట్లు సీడెడ్‌ : 1.16 కోట్లు వైజాగ్‌ : 1.58 కోట్లు కృష్ణ : 74 లక్షలు గుంటూరు : 1.04 కోట్లు ఈస్ట్‌ : 1.19 కోట్లు వెస్ట్‌ : 89 లక్షలు నెల్లూరు : 52 లక్షలు ఇతరం : 3.52 కోట్లు ఓవర్సీస్‌ : 3.3 కోట్లు మొత్తం : 20.49 కోట్లు.

మహేష్ జక్కన్న మూవీపై సూపర్ లీక్ ఇచ్చిన ఒడిశా డిప్యూటీ సీఎం.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు