తక్కువ కులం అని సహకరించని గ్రామస్తులు...దీంతో తల్లిశవాన్ని సైకిల్ పై..! కన్నీరు తెప్పించే సంఘటన!

కులాలు, మతాలు, కుతంత్రాలు.మనిషిని కాల్చుకు తింటున్నాయి.

వీటిపై ఎంత ప్రచారం జరిగినప్పటికీ ఎక్కడో చోట దారుణ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

నిపోయిన మృతదేహాన్ని కూడా ఏ ఒక్కరు కూడా కనీసం చూడలేదు కదా, ఖననం చేయాడానికి కూడా ఏ ఒక్కరు కూడా సహాకరించకపోవడంతో కన్న కొడుకే తల్లిని సైకిల్ పై తీసుకెళ్లి దహానం చేయాల్సివచ్చింది.

ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.వివరాల లోకి వెళ్తే.

ఒడిశాలోని కర్పాబహాల్‌ మానికి చెందిన జాంకి సిన్హానియా(45), తన కుమారుడు సరోజ్‌(17)తో కలిసి నివాసం ఉంటుంది.ఆమె భర్త గత కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు.దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

Advertisement

ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి మృతి చెందారు.తల్లి శవాన్ని ఇంటికి తీసుకొచ్చి కర్మకాండలు చేద్దామని ఊరివాళ్ళను సహాయం అడిగాడు సరోజ్.

కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు.కారణం వాళ్లు తక్కువ కులం వాళ్లని.

సరోజ్ అందరినీ బతిమాలాడు కానీ ఏ ఒక్కరు కూడా కనికరించలేదు.తక్కువ కులంవాళ్లను ముట్టుకుంటే తమకు పాపం చుట్టుకుంటుందని వెర్రిగా ఆలోచించారు ఆ గ్రామస్థులు.

దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్‌ పై తీసుకెళ్లి గ్రామానికి 6కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఖననం చేశాడు.అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ.ఎవరూ ముందుకు రాలేదని సరోజ్‌ తెలిపాడు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని కన్నీరు పెట్టుకున్నాడు.దేశం ఎంతో పురోగాభివృద్ది సాధిస్తుందని.

Advertisement

కుల, మత ద్వేశాలు లేవంటూ రాజకీయ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజా వార్తలు