ఫేస్ బుక్ ప్రేమ ... తల్లిని చంపించిన కూతురు !

ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని రోజులు ఇవి.ఇప్పుడు యువత అంతా సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోయారు.

ఆ మాయలో పడి తాము ఏంచేస్తున్నామో.ఏం జరుగుతుందో తెలియని మైకంలో పడిపోతున్నారు.

తాజాగా ఇటువంటి సంఘటనే.తమిళనాడులోని.తిరువళ్ళూరులో ఆంజనేయ పురంలో దేవీప్రియ తన తల్లి భానుమతితో కలిసి నివసిస్తుంది.19 సంవత్సరాల దేవీప్రియ స్థానిక అవడి అనే కాలేజీలో బీకాం రెండవ సంవత్సరం చదువుతుంది.ఆమెకు ఫేస్ బుక్ లో ఎస్.సురేశ్(19) అనే అతను దేవీకి పరిచయమయ్యాడు.వీరు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నారు.

తంజావూరు లోని కుంభకోణంలో సురేశ్ నివసిస్తున్నాడు.అయితే ఆమె ఈ విషయాన్ని తన తల్లి భానుమతికి చెప్పింది .తాము ఒకరినొకరు చూసుకోకుండా ఫేస్ బుక్ మాధ్యమంగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది.

Advertisement

దీంతో కోపానికి వచ్చిన భానుమతి.ముందుగా చదువుపై శ్రద్ధ వహించమని.

ఫేస్ బుక్ ప్రేమలను నమ్మవద్దని చెప్పింది.కూతురి స్మార్ట్ ఫోన్ పై కూడా భానుమతి ఆంక్షలు విధించింది.

దీంతో తల్లిని చంపడానికి దేవీప్రియ నిర్ణయం తీసుకుంది.అందుకు తన ప్రియుడైన సురేశ్ సాయం కోరింది.

అందుకు అంగీకరించిన సురేశ్ సోమవారం ఇద్దరు మైనర్ లను దేవీప్రియ ఇంటికి పంపాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

సురేశ్ పంపిన ఆ ఇద్దరికి దేవీప్రియ తన తల్లిని చూపించింది.దీంతో ముగ్గురు కలిసి తల్లి భానుమతిని కొడవళ్ళతో హత్య చేశారు.దాడి చేస్తున్నప్పుడు భానుమతి పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వారిని పోలీసులకు పట్టించారు.

Advertisement

పోలీసుల విచారణ లో దేవీప్రియ అసలు విషయం చెప్పడంతో ఆమెతో పాటు .ఆమె ప్రియుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు