మా ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయినట్లేనా?

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ MAA ఎన్నికల గురించి ఇటీవల అందరిలో ఆసక్తిని రేకెత్తి్స్తున్నారు మన టాలీవుడ్ నటీనటులు.

ముఖ్యంగా ‘మా’ ఎన్నికల కోసం రెండు వర్గాలు పోటీ పడుతుండటం ఈ ఎన్నికలను సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించేలా చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే మా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, ఇందులో ఎవరు విజయం సాధిస్తారా అనే అంశాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.ఇప్పటికే తాను ‘మా’ ఎన్నికలకు పోటీ చేస్తానని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించగా, తాను కూడా ఈ పోటీలో పాల్గొంటానని హీరో మంచు విష్ణు చేసిన ప్రకటనతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

అయితే మా ఎన్నికల పోటీలో వీరిద్దరితో పాటు జీవితా రాజశేఖర్, నటి హేమ వంటి పేర్లు కూడా వినిపించాయి.కానీ ప్రధాన పోటీ మాత్రం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మేరకు వారు తమ మద్దతును కూడబెట్టే పనుల్లో ఈ ఇద్దరు స్టార్స్ బిజీగా ఉన్నారు.కాగా తాజాగా మా ఎన్నికల గురించి మా అసోసియేషన్ ఆల్ జెనరల్ మీటింగ్(AGM)ను నిర్వహించింది.

Advertisement

ఈ మీటింగ్‌ను వర్చువల్ రూపంలో నిర్వహించారు.‘మా’ అధ్యక్షుడు కృష్ణం రాజు అధ్యక్షతన ఈ జెనరల్ మీటింగ్ జరిగింది.

ఈ సందర్భంగా మా ఎన్నికల తేదీ గురించిన అసోసియేషన్ సభ్యులు మూడు తేదీలను సూచించినట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 12, 19, 26వ తేదీల్లో మా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని వారు అభిప్రాయపడ్డారట.

అయితే సెప్టెంబర్ 29న గణేశ్ నిమజ్జనం ఉండటంతో ఆ రోజున ఎన్నికలు జరగవని, అందుకే సెప్టెంబర్ 26న అయితే అది అందరికీ అందుబాటులో ఉండే తేదీ అవుతుందని మా సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ‘మా’ ఎన్నికల తేదీని దాదాపు ఖరారు చేసినట్లే అంటున్నాయి సినీ వర్గాలు.

ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే మిగిలి ఉంది.ఈసారి ‘మా’ ఎన్నికల్లో లోకల్, నాన్-లోకల్ అనే అంశాన్ని సినీ నటులు తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారిన అంశం.

మరి ‘మా’ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో, ఎవరు ఈ పోటీలో గెలుస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ప్రముఖులు.

Advertisement

తాజా వార్తలు