Nani Dasara Movie: నాని ఆశలన్నీ దసరా సినిమాపైనే.. హిట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటో?

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ( Nani ) తాజాగా నటించిన చిత్రం దసరా.

( Dasara ) ఇందులో నాని సరసన కీర్తి సురేష్( Keerthy suresh ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమాలో నాని మొట్టమొదటిసారిగా మాస్ లుక్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.మరి నాని మాస్ పాత్రలో ఎలా కనిపించనున్నారు? ఎలా నటించాడు అన్న విషయాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాలి.కాగా విడుదల తేదీకి మరి కొద్దిరోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే గతంలో ఎప్పుడూ కూడా తన సినిమా ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగా కూడా మాట్లాడని నాని దసరా సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఎన్నో వివాదాలకు తెరలేపే విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఒకటి రెండు కాదు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.

Advertisement

ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన సినిమా గురించి తానే ఆకాశానికి తీసుకున్నాడు నాని.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభ్యంతరమైన కామెంట్స్ కూడా చేశాడు.

మిగతా హీరోలను మీ జుట్టు ఒరిజినలేనా అని అడగొద్దు అని తెలిపారు.మరి ఓవర్ ఏమిటంటే పుష్ప విడుదలయ్యే వరకు దర్శకుడు సుకుమార్ అంటే ఎవరో ఇతర పరిశ్రమల్లో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.టాలీవుడ్లో తనలాగా నటించే నటులు లేరన్నారు.

అలాగే దసరా సినిమా కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో పోల్చారు.గతంలో ఎప్పుడు కూడా నాని ఈ తరహా ప్రవర్తన చూపించలేదు.

దసరా మూవీ ప్రమోషన్స్ లో ఓ కొత్త నానిని పరిచయం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

ఆయన కామెంట్స్ వివాదాస్పదం అవుతాయని తెలుసు.అయితే ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడిన ప్రతి ఒక్క మాటలను నెటిజన్స్ అభిమానులు గుర్తు పెట్టుకున్నారు.సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా నెటిజెన్స్ ఏకిపారేయడం మాత్రం ఖాయం అని చెప్పవచ్చు.

Advertisement

ఇదేనా కెజిఎఫ్, ఇదేనా ఆర్ఆర్ఆర్ అంటూ నానిపై భారీగా ట్రోల్ చేస్తారని చెప్పవచ్చు.అంతేకాకుండా నాని కూడా దసరా సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.మరి ఒకవేళ దసరా సినిమా కనుక ఫ్లాప్ అయితే మరి నాని పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

తాజా వార్తలు