Director Srikanth Odela: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్ ఓదెల.. ఆ స్టార్ హీరోతో సినిమా?

టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా.

( Dasara ) ఇటీవల మార్చి 30వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

శ్రీకాంత్ ఓదెల( Director Srikanth Odela ) దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది.

రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డు స్థాయి వసూళ్లతో దుమ్మురేపుతోంది.సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే రూ.53 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించింది.అంతేకాకుండా నాని ( Nani ) కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్​ సినిమాగా నిలిచింది.ఫుల్​ రన్​లో ఈ సినిమా రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమాలో నటనకు గాను కీర్తి సురేష్ నానికి మంచి మార్కులే పడ్డాయి.అంతేకాకుండా దర్శకుడు శ్రీకాంత్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు అలాగే సెలబ్రిటీలు.

Advertisement

మరి ముఖ్యంగా డైరెక్టర్ శ్రీకాంత్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా దసరా సినిమాను మహేష్ బాబు చూశారు.

ఈ సినిమాను చూసిన తర్వాత మహేష్ బాబు సినిమా గురించి స్పందిస్తూ.

దసరా మూవీ విషయంలో ఎంతో గర్విస్తున్నాను.ఇది అద్భుతమైన సినిమా అని మహేష్ తన ట్వీట్ తెలిపారు.దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయింది.

మహేష్ లాంటి స్టార్ హీరో తమ మూవీ పై ట్వీట్ చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితీరు మహేష్ బాబుకు బాగా నచ్చిందని,

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

దానితో సూపర్ స్టార్ రాజమౌళి సినిమా తర్వాత శ్రీకాంత్ తో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమా పూర్తవుగానే రాజమౌళి సినిమాలో నటించనున్నారు.అనంతరం రాజమౌళి ప్రాజెక్టు తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Advertisement

అయితే ఈ విషయం పై మహేష్ బాబు కానీ దర్శకుడు శ్రీకాంత్ కానీ ఇంతవరకు స్పందించలేదు.

తాజా వార్తలు