ఈ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ పరార్..!

డార్క్‌ సర్కిల్స్( Dark circles ) అనేవి చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండవు.

ప్రధానంగా చూసుకుంటే నిద్రలేమి, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి, పోషకాల కొరత, అధిక స్క్రీన్ టైం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నలుపు ఏర్పడుతుంది.ఆ నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.

అయితే మార్కెట్లో లభ్యమయ్యే ప్రొడక్ట్స్ వ‌ల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలతో డార్క్ సర్కిల్స్ పరార్ అవ్వడం ఖాయం.

రెమెడీ 1: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్,( coffee powder ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ), వన్ టీ స్పూన్ తేనె మరియు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ మాస్క్ ను రెండు రోజులకు ఒకసారి వేసుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు కొద్దిరోజుల్లోనే పూర్తిగా మాయమవుతాయి.

Advertisement

రెమెడీ 2: గ్రీన్ టీ తో కూడా డార్క్ సర్కిల్స్ సమస్యకు బై బై చెప్పవచ్చు.అందుకోసం గ్రీన్ టీ ( Green tea )తయారు చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ పోసుకోవాలి.

అలాగే వన్ టీ స్పూన్ తేనె మరియు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడ‌టం వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు మాయమవుతాయి.ముడతలు ఏమైనా ఉన్నా కూడా తగ్గు ముఖం పడతాయి.

రోజుకు పావు గంట మెట్లు ఎక్కి దిగితే.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు