తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్14, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.33

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.11.00 ల11.30

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాల అందుకుంటారు.ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.

కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

భారత్‌లోని ఆ ప్రాంతంలో తిరుగుతూ కెమెరాకి చిక్కిన యూఎఫ్ఓ?
దండం పెడతాను నన్ను వదిలేయండి...పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!

వృషభం:

Advertisement

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు.

ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మిథునం:

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆదాయం బాగుంటుంది.సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కర్కాటకం:

ఈరోజు ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరులతో వివాదాలు కలుగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

సింహం:

ఈరోజు సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య:

ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది.దూరప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు.ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి.

ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

తుల:

ఈరోజు దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి.దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు.

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృత మవుతాయి.

మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు.వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు:

ఈరోజు గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

అవసరానికి కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మకరం:

ఈరోజు వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి.బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

కుంభం:

ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది.

ఆదాయ మార్గాలు తగ్గుతాయి.గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.

మీనం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని వ్యవహారాలలో ప్రముఖులు నుండి కీలక సమాచారం అందుతుంది.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

తాజా వార్తలు