మొజాంబిక్ లో తుఫాన్ భీభత్సం! వెయ్యి దాటిన మృతుల సంఖ్య

దక్షిణ ఆఫ్రికా దేశాలైన కెన్యా, మొజాంబిక్ లలో తుఫాన్ భీభత్సం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ తుఫాన్ ప్రభావం వలన చాలా గ్రామాలు నీటిలో కొట్టుకుపోయాయి.

అలాగే ఎక్కడికి అక్కడ రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి.దీంతో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

మరో వైపు ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో రక్షణ చర్యలు మొదలెట్టాయి.ఇదిలా ఉంటే ఈ తుఫాన్ భీభత్సంలో ఇప్పటి వరకు వెయ్యి మంది చనిపోయినట్లు మొజాంబిక్ ప్రభుత్వం గుర్తించింది.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.వేల సంఖ్యలో ప్రజలు తుఫాన్ కారణంగా గల్లంతు కావడంతో వారిలో ఎంత మంది చనిపోయి ఉంటారు అనే విషయంపై ఇప్పుడు తెలుసుకునే పనిలో ఉన్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

తాజా వార్తలు