హైదరాబాద్‎లో నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు

హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.

ఇవాళ, రేపు రెండు రోజుల పాటు తాజ్ కృష్ణ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించనున్నారు.

కాగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానుండగా తెలంగాణ పీసీసీ ఇప్పటికే ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసింది.రేపు ఉదయం 10.30 గంటలకు ఎక్స్ టెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు.ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాలే ప్రత్యేక ఎజెండాగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

తరువాత సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.ఈ సభకు సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు పార్టీ నేతలు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

కాగా సభా వేదికపై సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు