చైనాకు కరెంట్ కష్టాలు.. కారణం అదేనా

చైనాకు కరెంట్ కష్టాలు..

కారణం అదేనా.

 గుండుసూది నుంచి రాకెట్.ఎలక్ట్రానిక్స్ నుంచి జీన్స్ వరకు ఇలా ప్రపంచంలో ఏ వస్తువు నైనా తయారుచేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన చైనాలో ప్రస్తుతం కరెంట్ కష్టాలు వేధిస్తున్నాయి.60 శాతం ఆర్థిక వ్యవస్థ ఆధారపడే బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడడంతో అది కరెంటు ఉత్పత్తి పై ప్రభావం చూపింది.అది కాస్తా వివిధ రంగాలను కుదేలు చేస్తూ.

డ్రాగన్ వృద్ధిరేటును దెబ్బతీస్తుంది.రికార్డు స్థాయిలో బొగ్గు ధరలు, కరెంట్ ధరలపై ప్రభుత్వం నియంత్రణలు, కఠినమైన కర్బన ఉద్గారాల లక్ష్యాలు ఇలా అనేక కారణాలతో అంధకారం నెలకొనేలా చేసింది.

తయారీ హబ్గా పేరొందిన చైనాలోని గువాంగ్డాంగ్ లోను ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.కరెంటు కోతలు లేదంటే కొన్ని వారాలుగా తయారీపై విధించిన ఆంక్షల తో సప్లై చెయిన్ పూర్తిగా దెబ్బతింది.

Advertisement
Current Difficulties For China. Is That The Reason,latest News -చైనాక�

చాలా వరకూ మిషన్లను పక్కన పెట్టేస్తున్నారు.పనిగంటలు తగ్గిస్తున్నారు.

Current Difficulties For China. Is That The Reason,latest News

స్థానిక గ్రిడ్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఫ్యాక్టరీలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది.అయితే ఇప్పటికే తీసుకున్న ఆర్డర్లను సప్లై చేయాల్సి ఉండటంతో లక్ష్యాలను చేరుకోవడానికి నైట్ షిఫ్ట్ చేయించడం.సొంత జనరేటర్లు ఉపయోగించడం చేస్తున్నట్లు.

టీవీ లు తయారు చేసే ఒక సంస్థ జనరల్ మేనేజర్ చెబుతున్నారు.కరెంటు సంక్షోభం ముదిరితుండటంతో అన్ని కంపెనీల ఉత్పత్తులు ఆలస్యం తప్పదని చెబుతున్నాయి.

ఒక విధంగా కరెంటు విషయంలో చైనా ప్రస్తుతం అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది.కనీసం ఇళ్లకైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా కరెంటు సరఫరా చేయాలని ప్రత్యేకంగా సమావేశమైన జాతీయ గ్రిడ్ అధికారులు నిర్ణయించారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

కరెంటు వాడకంలో కరోనా మహమ్మారి మునుపటి పరిస్థితులు వచ్చిన వేళ చైనా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.అదే సమయంలో ఆస్ట్రేలియాతో నెలకొన్న రాజకీయ విభేదాలు నేపథ్యంలో ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు