కొంతమంది రైతులకు మారుతున్న వ్యవసాయ పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు.
కొబ్బరి తోటలలో, ఇంకా ఇతర తోటలలో అంతర పంటలను సాగు చేస్తే, రెండు దిగుబడులు పొంది మంచి ఆదాయం పొందవచ్చు.
పైగా తోటలలో అంతర పంటల సాగు చేయడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చిన మరొక పంట రైతుకు సపోర్టుగా ఉంటుంది.శ్రీకాకుళంలోని ఒక రైతు అంతర పంటను సాగు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
కోకో పంటను కొబ్బరి, అరటి, జీడిమామిడి తోటలలో అంతర పంటగా వేసుకుంటే శ్రమ తక్కువగా ఉండి ఆదాయం పొందవచ్చు.కోకో పంటకు తెల్ల దోమల బెడద ఉండదు.ఎక్కువగా పశువుల ఎరువు వినియోగించడం వల్ల కాయ దిగుబడి మెరుగ్గా ఉంటుంది.
కోకో పంట వేశాక, దీని చెట్ల ఆకులు నేలలో రావడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది.నేల సారవంతంగా తయారవుతుంది.నూతన వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వస్తున్న క్రమంలో, అంతర పంటలు సాగు చేయడం వలన రైతులకు లాభాలే తప్ప నష్టాలు ఉండవు.
మార్కెట్లో కోకో పంట కిలో 200 రూపాయలు.పెట్టుబడులు మొత్తం తీసేసి ఎకరాకు దాదాపు 70 వేల వరకు ఆదాయం పొందవచ్చు.ఆసక్తి ఉన్న రైతులు కొబ్బరి, అరటి, మామిడి తోటలలో నేలను వృధా చేయకుండా ఇలాంటి అంతర్ పంటలు వేయడం వల్ల భూమి సాగులోకి రావడం, నేల సారవంతం అవడం తో పాటు వేసిన రెండు పంటలలో ఒక పంటలో లాభం పొందలేకపోయినా మరొక పంటలో కచ్చితంగా ఆశించిన స్థాయిలో లాభం పొందవచ్చు.
వ్యవసాయ రంగంలో టెక్నాలజీ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది.వ్యవసాయ క్షేత్ర నిపుణులు ఇలాంటి పంటలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతుల పట్ల అవగాహనలు కల్పిస్తున్నారు.వారి సలహాతో మంచి దిగుబడులు సాధించవచ్చు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy