ఏపీలో రేపటి నుంచి పంటనష్టం అంచనా

ఏపీలో మిగ్జామ్ తుఫాను ప్రభావంతో కలిగిన పంటనష్టంపై అంచనా వేయనున్నారు అధికారులు.ఈ మేరకు ప్రభుత్వం చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో రేపటి నుంచి క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు నాశనమైన పంట పొలాలను పరిశీలించనున్నాయి.నష్టాన్ని అంచనా వేసిన అనంతరం ఈ నెల 25వ తేదీన లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.

జాబితా సిద్ధమయ్యాక కూడా మిగిలిపోయిన అర్హులుంటే మరో అవకాశం కల్పించనున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ నెల 31న ఏపీ ప్రభుత్వం తుది జాబితాను ప్రకటించనుంది.

అలాగే సంక్రాంతి పండుగలోగా పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు