KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ కేసు..!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై( KTR ) క్రిమినల్ కేసు నమోదైంది.

ఈ మేరకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ పై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు( Bathina Srinivas Rao ) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని కేటీఆర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే అసలు హన్మకొండ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు కాగా దాన్ని బంజారాహిల్స్ పోలీస్‎స్టేషన్( Banjara Hills Police Station ) ట్రాన్స్ ఫర్ చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
The Foods That Help To Kill Breast Cancer Details

తాజా వార్తలు