వైసీపీకి క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై..!!

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీని( YCP ) వీడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానన్న అంబటి రాయుడు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.అయితే ఇటీవలే సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) సమక్షంలో అంబటి రాయుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అందరూ భావించారు.ఈ సందర్భంగానే అంబటి రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు.

అయితే తాజాగా రాజకీయాలకు ( Politics ) దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
ఉద్యోగాన్ని వదిలి ఇతరుల ఇళ్లను ఉచితంగా శుభ్రం చేస్తున్న 'కత్రినా'

తాజా వార్తలు