'గుంటూరు కారం'లో మూడో హీరోయిన్.. స్టార్ హీరోయినే సెట్ చేసిన త్రివిక్రమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Karam ) .

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ అంచనాలను పెంచేందుకు ఒక్కో అప్డేట్ బయటకు వస్తుంది.ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది.ఇక ఇప్పుడు మూడవ హీరోయిన్ ఉందని టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఒక రూమర్ మాత్రం వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో కేవలం రెండు సీన్స్ కోసం మరో స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.ఈ పాత్ర చిన్నది అయినా కూడా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారట.

Advertisement

మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇది నిజం అయితే మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.ఈ మూడవ హీరోయిన్ రోల్ సెకండాఫ్ లో ఉంటుందట.చూడాలి కాజల్ ఓకే చెబితే ఓకే కానీ నో చెబితే మరో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో?

గుంటూరు మిర్చి( Guntur Mirchi Yard ) యార్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

త్రివిక్రమ్( Trivikram ), మహేష్ బాబు ఇద్దరు కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.చూడాలి మరి మహేష్ కు త్రివిక్రమ్ ఎలాంటి హిట్ ఇస్తాడో.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

తాజా వార్తలు