సినిమా మొదలు పెట్టడానికి టెంకాయ కొట్టిన కిరాక్ ఆర్పీ...!

జబర్దస్త్ కామెడీ షో లో ఒక్కడైనా కిరాక్ ఆర్పీ తాజాగా సినీ దర్శకుడి గా అవతారమెత్తాడు.

సినిమా దర్శకుడి లా మారేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి తెగ ప్రయత్నం చేస్తున్నా, ఎట్టకేలకి తను అనుకున్న పని చేయబోతున్నాడు.

కిరాక్ ఆర్పి ఎట్టకేలకు తన క్రేజీ ప్రాజెక్టు ను అనౌన్స్ చేసి సినిమా షూటింగ్ తీయడానికి రెడీ అయిపోయాడు .ఇక ఇందులో జె.డి.చక్రవర్తి, రావు రమేష్, ప్రకాష్ రాజ్ మొదలగు తారాగణం ప్రధాన పాత్రలో సినిమాలో కనిపించబోతున్నారు.ఈ సినిమాను శ్రీ పద్మజా పిక్చర్స్ బ్యానర్ పై కొవ్వూరు అరుణాచలం నిర్మించబోతున్నారు.

Kirak Rp, Nagababu, Jd Charavarthi, Direction, New Movie Puja, Rao Ramesh, Praka

అయితే ఇందుకు సంబంధించి నేడు పూజా కార్యక్రమాలు మొదలవగా ఆ కార్యక్రమానికి మెగాస్టార్ బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇకపోతే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరక్కించబోతున్నారు.

చిత్ర బృందానికి నాగబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ సినిమా ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో కిరాక్ ఆర్పి ముందుకు రాబోతున్నట్లు ఆయన తెలియజేశారు.

Advertisement

అయితే ఈ సినిమాలో జె.డి.చక్రవర్తి నటించడానికి ఒప్పుకోవడం నిజంగా విశేషమే.ఇందుకు కారణం ఆ సినిమాలో జేడీ చక్రవర్తి చాలా విలక్షణంగా ఉండడమే.

ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను హైదరాబాద్ నగరంలో అలాగే నెల్లూరు ప్రాంతంలో షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు ఆర్పి తో పాటు చిత్ర బృందం తెలియజేశారు.ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీత బాధ్యతలు వహించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు