CPI Narayana Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సీరియస్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో ప్రధాని మోడీతో భేటీ కావడం తెలిసిందే.

ఆ భేటీ అనంతరం పొత్తుల విషయంలో పవన్ చాలా సైలెంట్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఏపీలో పొత్తుల విషయంలో పవన్ పై సీపీఐ నారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చే ఎన్నికలకు టిడిపి, జనసేన ఇక వామపక్ష పార్టీలు కలిసి ముందుకెళ్లాలని తేల్చి చెప్పారు.

ఈ రకంగా ముందుకెళ్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాష్ట్రంలో బిజెపి మరియు వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని నారాయణ ఆరోపించారు.ప్రధాని మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్.

Advertisement

ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పిన పవన్.

ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీశారు.ప్రజలను మోడీ మరియు జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు.

వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే వామపక్షాలు మరియు జనసేన, టిడిపి కలిసి ఎన్నికలలో ముందుకెళ్లటం తప్ప మరొక మార్గం లేదని.సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తాజా వార్తలు