అసెంబ్లీ లైవ్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్న వైసీపీ, టీడీపీ.. ఎవ్వ‌రూ త‌గ్గేదే లే..

ఇప్పుడు ఏపీలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య రాజ‌కీయాలు అగ్గిరాజేస్తున్నాయి.ఇప్ప‌టికే ఇండ్ల ముట్ట‌డిల వ‌ర‌కు వారి రాజ‌కీయాలు వ‌చ్చాయంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

అలాంటిది రేపు ప్ర‌త్య‌క్షంగా త‌ల‌ప‌డ‌నున్నాయి.ఇక త్వ‌ర‌లోనే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.ఇక ఇన్ని రోజులు మైకుల ముందు ఢీ అంటే ఢీ అన్న వారంతా కూడా రేపు ప్ర‌త్య‌క్షంగానే పోరాటానికి దిగుతున్నారన్నమాట‌.

అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అసెంబ్లీ పోరు ఎలా ఉంటుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఉన్న గొడ‌వ‌ల నేప‌థ్యంలో సీఎం జగన్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా వ్యవహరిస్తార‌నే దానిపైనే అంద‌రి దృష్టి ఉంది.

Advertisement
YCP, TDP Preparing For Assembly Live Battle .. No One Will Fall .. YCP, Tdp , Ap

వాస్త‌వానికి గ‌తంలో కూడా ఏ రాష్ట్ర అసెంబ్లీ సభల‌పై లేనంత హైప్ కేవ‌లం ఏపీ అసెంబ్లీ మీదే ఉంటుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో చర్చలకంటూ కూడా ఇరు పార్టీల న‌డుమ వ్యక్తిగత దూషణలతోపాటు స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌కే ఎక్కువ అవ‌కాశం ఉంటుంది.

అందుకే ఈ స‌మావేశాల‌పై అంత ఆస‌క్తి ఉంటుంది.

Ycp, Tdp Preparing For Assembly Live Battle .. No One Will Fall .. Ycp, Tdp , Ap

ఇక ఇప్ప‌టికే చంద్రబాబు ఇంటి ముట్ట‌డి లాంటివి బాగానే రాజ‌కీయ వేడిని రాజేస్తున్నాయి.ఈ త‌రుణంలో ఇప్పుడు అసెంబ్లీలో దీనిపై బాగానే ర‌చ్చ సాగె అవ‌కాశం ఉంది.ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం విప‌రీతంగా అంటే లిమిట్ దాటేసి చేస్తున్న అప్పులు కూడా అలాగే కేంద్రం నుంచి ఈ అప్పుల విష‌యంలో వస్తున్న విమర్శల లాంటివి టీడీపీకి ప్ల‌స్ పాయింట్‌గా మారే ఛాన్స్ ఉంది.

ఇక అటు వైసీపీ బ‌లం అసెంబ్లీలో ఎక్కువ‌గా ఉన్నా కూడా టీడీపీకి మాట్లాడేందుకు బాగానే పాయింట్లు ఉన్నాయి.ఇక అటు లోకేష్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై కూడా వైసీపీ పోరాడే ఛాన్స్ ఉంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు