17 కు చేరిన కరోనా మృతుల సంఖ్య, ఆందోళనలో అధ్యక్షుడు

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ పోతుంది.ఈ కరోనా ప్రభావం అగ్రరాజ్యం అమెరికా లో కూడా తీవ్ర స్థాయిలో విస్తరించింది.

ఈ కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 కు చేరగా,330 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.మరోపక్క దేశంలో ప్రబలుతున్న ఈ కరోనా వ్యాధిని ఎదుర్కోవడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసరంగా 8.3 బిలియన్ డాలర్ల వ్యయానికి ఉద్దేశించిన ప్యాకేజి పై సంతకం కుడా చేసారు.అంతేకాకుండా ఈ కరోనా దేశంలో ప్రబలకుండా కరోనా నియంత్రణ బాధ్యతను అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కి అప్పగించిన సంగతి తెలిసిందే.

Coronavirus Death Cases 17-17 కు చేరిన కరోనా మృత�

దీంతో పెన్స్.వివిధ దేశాల ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా.కరోనాకు గురై మృతి చెందినవారి సంఖ్య 3,450 కి పెరగగా 92 దేశాల్లో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య కూడా లక్షకు పెరగడం తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

అటు -న్యూయార్క్ సిటీలో కొత్తగా 22 కేసులు నమోదు కాగా.మొత్తం ఈ సంఖ్య 44 కి పెరిగింది.

మరోవైపు- ఇజ్రాయెల్ అనుకూల లాబీ వాషింగ్టన్ లో నిర్వహించిన సభకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇతర ఎంపీలు హాజరయ్యారు.న్యూయార్క్ లో కరోనాకు గురైన ఓ జంట కూడా ఈ కాన్ఫరెన్స్ కు వఛ్చినట్టు తెలియడంతో అంతా ‘అలర్ట్’ అయ్యారు.

టెస్టుల్లో ఈ జంటకు కరోనా వైరస్ లక్షణాలు పాజిటివ్ అని వెల్లడైందని అమెరికన్-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ.ఈ-మెయిల్ ద్వారా ఈ సభకు హాజరైనవారందరికీ తెలిపింది.

దీనితో అందరూ ఆందోళన చెందారు.

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!
Advertisement

తాజా వార్తలు