కరోనా అలర్ట్‌ : వచ్చే నెలలో మొబైల్‌ కొనాలనుకునే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

ప్రస్తుతం చైనాను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది.

వాణిజ్యరంగంలో అగ్రగామి అయిన చైనా ప్రస్తుతం అన్ని విధాలుగా షట్‌ డౌన్‌ను తలపిస్తుంది.

చైనా నుండి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ మరియు ఇతరత్ర పరికరాలు ఇండియాతో పాటు పలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయి.ప్రస్తుతం అవన్నీ కూడా ఆగిపోయాయి.

చైనా నుండి ఇతర దేశాలకు పూర్తిగా ఎగుమతి ఆగిపోవడంతో పాటు, ఆ దేశానికి ఇతర దేశాల నుండి పలు రకాల ఉత్పత్తులు మరియు ముడి సరుకు దిగుమతి ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో మొబైల్స్‌తో పాటు చైనా నుండి తయారు అయ్యి వచ్చే ఎన్నో వస్తువులు మరియు ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ ఇండియాలోకి దిగుమతి ఆగిపోయాయి.ఆ కారణంగానే ప్రస్తుతం ఉన్న మొబైల్స్‌ను అమ్మేస్తే మార్కెట్‌లో మొబైల్స్‌ అనేవి ఉండవు.ఆ కారణంగానే కొందరు ఇప్పటి నుండే కృత్రిమ లోటును చూపిస్తుంటే మరి కొన్ని చోట్ల మాత్రం ఇప్పటి నుండే ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు.

Advertisement

ఇండియాలోని స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో 80 శాతంకు పైగా చైనా మొబైల్స్‌దే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తక్కువ రేటుతో పాటు ఎక్కువ ఫీచర్స్‌ ఉండే చైనా ఫోన్‌ను ప్రతి ఒక్కరు వినియోగిస్తూ ఉన్నారు.కొత్తగా ఫోన్‌లు కొనాలనుకునే వారు కూడా చైనా ఫోన్‌నే చేస్తూన్నారు.ప్రస్తుతానికి చైనా ఫోన్‌లు ఇండియాలో లభిస్తూనే ఉన్నా వచ్చే నెల వరకు 80 నుండి 90 శాతం వరకు అయిపోతాయని, దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.

వచ్చే నెలలో ఆ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే రెట్టింపు ధర పెట్టాల్సి ఉంటుంది.అవి కూడా అయిపోతే ఆ రెట్టింపు ధరకు కూడా లభించే ఛాన్స్‌ లేదు.

కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టకుంటే భవిష్యత్తులో మరింత ప్రమాదం తప్పదంటూ మొబైల్‌ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మీరు ఒక వేళ మొబైల్‌ను వచ్చే నెలలో లేదంటే త్వరలో కొనాలనుకుంటే వెంటనే ఇప్పుడే కొనేయండి.ఆ తర్వాత కొనలేరు అంటూ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

తెలుగు తెరకు కృష్ణ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు