మీరు కొన్నాళ్లు తిరుపతి రాకండి ప్లీజ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కల్లోల వాతావరణం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక రంగం అంతా కూడా అతలాకుతలం అవుతుంది.ఉత్పత్తి నిలిచి పోయింది.

జనాలు ఎక్కడిక్కడ ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నారు.తాజాగా టీటీడీ కూడా అదే పని చేసింది.

ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకు రావద్దంటూ సూచించింది.ప్రతి ఒక్కరి రక్షణ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని దయచేసి అనారోగ్య సమస్యలు ఉన్న వారు రావద్దని టీటీడీ అధికారులు ఒక ప్రెస్‌ నోట్‌లో పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ తిరుమలలో వ్యాప్తి చెందకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు.అయినా కూడా మరింత ముందు జాగ్రత్తలతో వ్యవహరించే ఉద్దేశ్యంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తిరుమల శ్రీవారి దర్శనంకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

గతంలో ఎప్పుడు లేని విధంగా వింత పోకడలు ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తున్నాయి.కరోనా కారణంగా గత కొన్ని వారాలుగా జనాలు చాలా పల్చగా వస్తున్నారు.

ఇప్పుడు ఈ ప్రకటనతో మరింతగా జనాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు