భార‌త్ లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా..!

భార‌త్ లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.వ‌రుస‌గా రెండు రోజుల్లో దాదాపు మూడు వేల‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 15,754 కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.అదే స‌మ‌యంలో 39 మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు.

దీంతో ఇప్ప‌టివ‌ర‌కు చనిపోయిన వారి సంఖ్య 5,27,253కి చేరుకుంది.దేశంలో ప్రస్తుతం 1,01,830 క్రియాశీల కేసులు ఉండ‌గా.

ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,43,14,618కి చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు.గత 24 గంటల్లో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది.

Advertisement

దాంతో, ఇప్పటిదాకా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,36,85,535కి చేరుకుంది.క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉండగా.రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది.రోజువారీ పాటిజివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది.

Advertisement