దేశంలో కరోనా @ 56,46,011 కేసులు..!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.గత నాలుగు రోజులుగా తగ్గతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.

రోజూ వేలల్లో కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు.

ఈ మహమ్మారి ఒకరిని నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.కేంద్రం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా వైరస్ తీవ్రత తగ్గడం లేదు.

నిన్న 75 వేలకే పరిమితమైన కరోనా కేసులు.ఈ రోజు 83 వేలకు పైగా నమోదయ్యాయి.

Advertisement

తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83,347 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 56,46,011కి చేరింది.నిన్న ఒక్కరోజే 1085 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.

దీంతో వీరి సంఖ్య 90,020కి చేరింది.ఇప్పటివరకూ 45,87,614 మంది కరోనా బారిన పడి కోలుకున్నారని, ప్రస్తుతం దేశంలో 9,68,377 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో 9,53,683 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.నిన్నటి వరకూ 6,62,79,462 కరోనా శాంపిళ్లను పరీక్షించామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.బయటికి వెళ్లేటప్పుడు సామాజిక దూరం పాటించాలన్నారు.

Advertisement

ఇమ్యూనిటిని పెంచుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, రోజూ వ్యాయామం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

తాజా వార్తలు