వైసీపీలో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం..!!

ఏపీలోని వైసీపీలో మార్పులు చేర్పుల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోని వారిని బుజ్జగించేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి గత కొద్ది రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.దీంతో ఆయనతో పార్టీ అగ్రనేతలు మరోసారి చర్చలు జరుపుతున్నారు.

రక్షణనిధి వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఆయన పార్టీలో కొనసాగేలా చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.దీంతో రక్షణనిధితో అగ్రనేతలు మరోసారి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement