లేత‌ కొబ్బ‌రిని ఈ విధంగా తీసుకుంటే మీ బాడీ రెట్టింపు ఎన‌ర్జీతో ప‌ని చేస్తుంది!

కొబ్బ‌రి.తినేందుకు రుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను సైతం అందిస్తుంది.

అందులోనూ లేత కొబ్బ‌రి ఇంకా మంచిది.చాలా మంది కొబ్బ‌రి బోండంలోని నీటిని తాగుతారు.

అయితే అందులో లేత కొబ్బ‌రిని పెద్దగా పట్టించుకోరు.కానీ, లేత కొబ్బ‌రి మ‌న‌కు చాలా మేలు చేస్తుంది.

ముఖ్యంగా లేత కొబ్బ‌రిని ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే.మీ బాడీ రెట్టింపు ఎన‌ర్జీతో ప‌ని చేస్తుంది.

Advertisement

అదే స‌మ‌యంలో మీకు ఎన్నో అద్భుత‌మైన ఆరోగ్య లాభాలు సైతం ల‌భిస్తాయి.మ‌రి ఇంకెందుకు లేటు లేత కొబ్బ‌రిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక క‌ప్పు లేత కొబ్బ‌రి, ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన పాలు, అర క‌ప్పు కొబ్బ‌రి నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్, మూడు ఐస్ క్యూబ్స్‌ వేసుకుని నాలుగు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ లేత కొబ్బ‌రి మిల్క్ షేక్ సిద్ధం అవుతుంది.ఈ మిల్క్ షేక్‌ను వారంలో కనీసం మూడు సార్లు అయినా తీసుకోండి.

త‌ద్వారా నీర‌సం, అల‌స‌ట వంటివి ప‌రార్ అవుతాయి.బాడీ మునుప‌టి కంటే రెట్టింపు ఎన‌ర్జీతో ప‌ని చేస్తుంది.అలాగే ఈ మిల్క్ షేక్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగ‌క సామ‌ర్థ్యం పెరుగుతుంది.

స్పెర్మ్ కౌంట్ వృద్ధి జ‌రుగుతుంది.స్త్రీల‌లో సంతాన స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అంతేకాదు, ఈ లేత కొబ్బ‌రి మిల్క్ షేక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల్జీమ‌ర్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

Advertisement

గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.

మ‌ల‌బ‌ద్ధ‌కం త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది.