ప‌ర‌గ‌డుపున‌ ల‌వంగాల‌ను ఇలా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో!

ల‌వంగాలు.మ‌సాలా దినుసుల్లో వీటికి ప్ర‌త్యేక స్థానం ఉంది.

ఘాటైన రుచి, వాస‌న క‌లిగే ఉండే ల‌వంగాలను నాన్‌వెజ్ వంట‌ల్లో, బిర్యానీల్లో విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.

అలాగే ల‌వంగాల్లో ఎన్నో పోష‌కాలు, మ‌రెన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అయితే ఆ ప్ర‌యోజ‌నాలు ల‌వంగాల‌ను తీసుకునే విధానంపై కూడా ఆధార‌ప‌డి ఉంటాయి.ముఖ్యంగా ల‌వంగాల‌ను ప‌ర‌గ‌డుపున ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య లాభాలు ల‌భిస్తాయి.

Advertisement

మ‌రి లేటెందుకు ల‌వంగాల‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో హాఫ్ స్పూన్ ల‌వంగాల పొడిని వేసి ఐదు నుండి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.ఇలా మ‌రిగిన వాట‌ర్‌ను స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుని.

అందులో వ‌న్ టేబుల్ స్పూన్ తేనెను క‌లిపి సేవించాలి.ప‌ర‌గ‌డుపున ఈ విధంగా ల‌వంగాల‌ను తీసుకుంటే శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు, విషాలు తొల‌గిపోతాయి.

బాడీ డిటాక్స్ అవుతుంది.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

వెయిట్ లాస్ అవుతారు.కాలేయం శుభ్రంగా మారుతుంది.

Advertisement

క్యాన్స‌ర్‌కు కార‌ణం అయ్యే ఫ్రీ రాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారి గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అంతేకాదు, పైన చెప్పిన విధంగా ల‌వంగాను ప‌ర‌గ‌డుపున తీసుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సూప‌ర్ స్ట్రోంగ్‌గా త‌యార‌వుతుంది.ఎముక‌లు దృఢంగా మార‌తాయి. పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది.

జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, అతిసారం వంటి స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే.వాటి నుండి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు