ఒకటి రెండు తేదీలలో శ్రీవారి దర్శన వేళలలో మార్పులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి రోజు మన దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి శ్రీవారికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.

శ్రీవారి దేవాలయంలో జనవరి 1, 2, 3 వ తేదీలలో కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆలయ సహాయ ఎగ్జిక్యూటివ్ అధికారి యు.

రమేష్ వెల్లడించారు.ప్రభుత్వ అధికారుల సహాయంతో క్యూ లైన్ల ఏర్పాటు తాగునీరు, ప్రధమ చికిత్స, వైద్య కేంద్రాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

భక్తులందరికీ ఎక్కువ సమయం దర్శనం కలిగించేందుకు ఆలయ దర్శన వేళలు పెంచుతున్నామని కూడా భక్తులకు శుభవార్త చెప్పారు.జనవరి ఒకటో తేదీ కొత్త సంవత్సరం, రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ సర్వదర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులు అందరికీ జనవరి 1, 2 తేదీల్లో తెల్లవారు జామున 3 నుంచి ఉదయం 7 గంటల వరకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.ఈ మూడు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఎలాంటి వాహనాలు కొండపైకి అనుమతించమని వయోవృద్ధులు, వికలాంగుల కోసం వాహన సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.

Consider These Changes In Darshan Timings Of Tirumala On January 1 And 2 Details
Advertisement
Consider These Changes In Darshan Timings Of Tirumala On January 1 And 2 Details

తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుపతి నగరానికి చెందిన పారిశ్రామికవేత శేషు మస్తాన్ రావు సుమారు 20 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు.శుక్రవారం ఉదయం మస్తాన్ రావు కుటుంబ సభ్యులందరితో పాటు వచ్చి శ్రీనివాసునికి అలంకరించే వివిధ వెండి, బంగారు ఆభరణాలను పండితులకు అందజేయగా వేద పండితులు వాటికి పూజలు జరిపారు.ఆ తర్వాత వాటిని స్వామివారికి అలంకరించారు.

ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ ప్రముఖ అధికారులందరూ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు