మేనిఫెస్టోతో ప్రజల ద్రుష్టికి ఆకర్షించిన రాహుల్! ఏపీ ప్రత్యేక హోదాకి పెద్ద పీట

దేశ రాజకీయాలలో మోడీ ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారంలోకి రావాలని లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధాని పదవిని అలంకరించాలని ఎదురుచూస్తున్న రాహుల్ గత కొంత కాలంగా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

మోడీ పరిపాలన, ప్రభుత్వ వైఫల్యాలని అడుగడుగునా ఎండగడుతూ తనదైన శైలిలో ముందుకి వెళ్తున్నాడు.

ఇంతకాలం పప్పు అన్న నోటితోనే ఇప్పుడు రాహుల్ మాటల దాడి, చేతల వాడి చూసి బీజేపీ పార్టీ కంగారు పడుతుంది.అయితే ఎలా అయిన మోడీకి ఫుల్ స్టాప్ పెట్టాలని రాహుల్ వచ్చిన ప్రతి అవకాశం వినియోగించుకుంతో ఎన్నికల ప్రచారంలో దూకుతున్నాడు.

ఇదిలా ఉంటే రెండు లోక్ సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో నిలబడుతున్న రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టో ని విడుదల చేసింది.ఎఐసిసి ప్రెసిడెంట్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆద్వర్యంలో రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసారు.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిన కాంగ్రెస్ పార్టీ, జీఎస్టీని రద్దు చేస్తామని, అలాగే పాత నోట్లు చెలామణిలోకి తీసుకొస్తామని, అలాగే పేదలని గుర్తించి వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని హామీలు ఇచ్చారు.

Advertisement

అలాగే రైతుల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తూ, ఉపాధి హామీ పని దినాలు పెంచడానికి హామీ ఇచ్చారు.ఇక మేనిఫెస్టో లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలని అమలు చేస్తామని చెప్పుకొచ్చింది.అయితే ఇక ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా కూడా తెలుగు ప్రజల అభ్యున్నతికి పెద్ద పీట వేయడం ద్వారా తెలుగు ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేసారని చెప్పాలి.

మరి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోకి ప్రజలు ఎంత వరకు కనెక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు