రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలు తగవు - కేవీపీ రామచంద్ర రావు

రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలు తగవు అని మాజీ రాజ్య సభ సభ్యులు కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు అన్నారు.

విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబానీ అదానీ అక్రమ సంపాదనతో మోడీ కి వాటాలు ఉన్నాయి అని ఆరోపించారు.

వారి ఆస్తులను పెంపుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు అని అన్నారు.దీనిని ప్రశ్నించిన వారి పై దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు అని పేర్కొన్నారు.

ఒక పార్లమెంట్ సభ్యుడునీ పార్లమెంట్ కు రాకుండా అడ్డుకొనడం ద్వారా తమ అక్కసు వెళ్లగక్కారు అని వ్యాఖ్యానించారు.ఢిల్లీ లో సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని గుర్తు చేశారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు